దుమ్మరేపిన సన్‌రైజర్స్.. పంజాబ్‌కు భారీ టార్గెట్..

దుమ్మరేపిన సన్‌రైజర్స్.. పంజాబ్‌కు భారీ టార్గెట్..

ఐపీఎల్ 2019 ప్లేఆఫ్‌లో అడుగుపెట్టాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు బ్యాటింగ్‌లో రెచ్చిపోయింది. సొంతగడ్డపై కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ బౌలర్లను చీల్చి చెండారారు హైదరాబాద్ బ్యాట్స్‌మన్స్... ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ 56 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 81 పరుగులు చేయగా.. వృద్ధిమాన్‌ సాహా 28, మనీశ్‌ పాండే 36, మహ్మద్‌ నబీ 20 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసి పంజాబ్ ముందు 213 పరుగులు భారీ టార్గెట్ పెట్టింది.