ఆ రోజు మమ్మల్ని చూసి కోహ్లీ టెన్షన్ పడ్డాడు : వార్నర్  

ఆ రోజు మమ్మల్ని చూసి కోహ్లీ టెన్షన్ పడ్డాడు : వార్నర్  

సన్‌రైజర్స్ హైదర్‌బాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ అలాగే  జానీ బెయిర్‌స్టో కలిసి గత ఏడాది జట్టు కు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించారు. అయితే ఈ ఇద్దరు ఓపెనర్లుగా మంచి భాగస్వామ్యాలు నెలకొల్పారు. 2014 నుండి వార్నర్ హైదర్‌బాద్  జట్టులో ఉండగా, బెయిర్‌స్టో గత సీజన్‌లో సన్‌రైజర్స్‌లో చేరాడు. వారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వ్యతిరేకంగా 185 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఆ ఇన్నింగ్స్ ను గుర్తు చేసుకున్న వార్నర్ అప్పటి కొన్ని విషయాలను వివరించాడు. ఆర్సీబీ కెప్టెన్ అయిన కోహ్లీ అప్పుడు తమ బ్యాటింగ్ చూసి చాల టెన్షన్ పడ్డాడని తెలిపాడు. అలాగే ఎంత సేపటికి వికెట్ పడగపోవడంతో తనకు చాల విసుగు వచ్చిందని తెలిపాడు. అయితే వార్నర్ గత సీజన్లో 12  మ్యాచ్ల్లో  692 పరుగులు సాధించగా, బెయిర్‌స్టో 10 మ్యాచ్ల్లో 445 పరుగులు చేశాడు.