బాహుబలి గా మారిన వార్నర్...

బాహుబలి గా మారిన వార్నర్...

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ నిలిపివేయడంతో, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) యొక్క 13 వ సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు న్యాయకత్వం వహించబోయే ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్, తన కుటుంబ సభ్యులతో పాటు చేస్తున్న వీడియోలను తన టిక్ టోక్ ‌లో రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. వరుస టాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వీడియోలు చేస్తున్న వార్నర్ మొదట అల్లు అర్జున్ యొక్క బుట్ట బొమ్మ పాటను విజయవంతంగా చేసిన తరువాత మరియు 2006 నాటి మహేష్ బాబు యొక్క బ్లాక్ బస్టర్ పోకిరి డైలాగ్ తో అదరగొట్టాడు. ఇక ఇప్పుడు వార్నర్ టిక్ టోక్ లో మరొక హీరోకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసాడు. అందులో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలోని "అమరేంద్ర బాహుబలి అను నేను" అనే డైలాగ్ తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇక ఐపీఎల్ 2020 కి వార్నర్ ‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా నియమించారు. అయినప్పటికీ, కరోనావైరస్ వ్యాప్తి చెందడంతో ఐపీఎల్ తదుపరి నోటీసు వచ్చే వరకు నిలిపివేయబడింది.