ఆ ఓటమి చాలా బాధ కలిగించింది : డేవిడ్‌ వార్నర్

ఆ ఓటమి చాలా బాధ కలిగించింది : డేవిడ్‌ వార్నర్

పంజాబ్ పై 12 పరుగుల తేడాతో ఓటమిపాలవ్వడం చాలా భాదకు గురి చేసిందని హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నారు. తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని ప్రసంశలు కురిపించారు డేవిడ్ వార్నర్. అయితే నిన్నటి ఓటమి మాత్రం తనను చాలా బాధకు గురి చేసిందని వార్నర్ అన్నారు. పంజాబ్ ను కట్టడి చేయడంలో తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని, ఛేదనలో శుభారంభం దక్కాక ఆ లయను కోల్పోయామని చెప్పాడు. మరోవైపు ఆ వికెట్ పై ఆడటం చాలా కష్టమని..ఒక్కసారి స్పిన్ బౌలింగ్ బరిలోకి దిగితే అంతేనని పేర్కొన్నాడు. కాగా.. నిన్నటి ఓటమితో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేఆఫ్‌ ఆశలు ఆవిరయ్యాయి.

కీలక మ్యాచ్‌లో పంజాబ్‌ చేతిలో ఓటమిపాలైంది వార్నర్‌ సేన. స్వల్ప టార్గెట్‌ను ఛేదించలేకపోయింది. వరుసగా నాలుగో మ్యాచ్‌లో విజయం సాధించింది కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్. కేఎల్‌ రాహుల్ కెప్టెన్సీలో పంజాబ్‌ కింగ్స్ ఎలెవన్ దూసుకుపోతోంది. సీజన్‌ ఆరంభంలో వరుస ఓటములు ఎదురైనప్పటికీ.. ఇప్పుడు పుంజుకుంటోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లో విజయం సాధించింది. 127 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్‌ను 114కే కుప్పకూల్చింది. 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.