టిక్ టాక్ బ్యాన్ తర్వాత మొదటి వీడియో షేర్ చేసిన వార్నర్... 

టిక్ టాక్ బ్యాన్ తర్వాత మొదటి వీడియో షేర్ చేసిన వార్నర్... 

కరోనా లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి  సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ టిక్ టాక్ వీడియోలతో అభిమానులను అలరించాడు. కానీ భారత ప్రభుత్వం ఆ టిక్ టాక్ తో సహా మొత్తం 59 చైనా యాప్స్ ను బ్యాన్ చేయడంతో అభిమానులకు దూరమయ్యాడు డేవిడ్ భాయ్. ఇక తాజాగా టిక్ టాక్ బ్యాన్ తర్వాత మొదటి వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసాడు వార్నర్. కానీ అది తనకు సంబంధించిన వీడియో  కాదు. అందులో తన సన్‌రైజర్స్ ఫ్రాంచైజీలోని శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్, ఆల్ రౌండర్ విజయ్ శంకర్ డ్యాన్స్ చేయడాన్ని చూడవచ్చు, ఆ సమయం లో అక్కడ  ఆశిష్ నెహ్రా కూడా ఉన్నాడు. ఇక ఆ వీడియోకు "ఈ ఇద్దరు నృత్యకారులకు పేరు పెట్టండి ?" అని క్యాప్షన్ ఇచ్చాడు వార్నర్. ఈ పోస్ట్ పై యురాజ్ సింగ్ స్పందిస్తూ... ''నేను భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా డ్యాన్స్ చూడటానికి ఇష్టపడతాను'' అని కామెంట్ జత చేసాడు. అయితే వీడియోలో అతడిని డాన్స్ చేయమంటే అతను నిరాకరించాడు.