ఇండియాలో లేం..గుర్తు పెట్టుకోండి : వార్నర్‌ వార్నింగ్‌ 

ఇండియాలో లేం..గుర్తు పెట్టుకోండి : వార్నర్‌ వార్నింగ్‌ 

ఐపీఎల్-2020‌లో సన్‌ రైజర్స్‌ మరో ఓటమి చవి చూసింది. అటు కేకేఆర్‌ ఐపీఎల్‌లో మొదటి  బోణీ కొట్టింది.  సన్ ‌రైజర్స్‌ హైదరాబాద్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా సునాయాసంగా ఛేదించింది. దీంతో  పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది సన్‌ రైజర్స్.  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్ ‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో సన్‌రైజర్స్‌ ఏ దశలోనూ భారీ స్కోర్‌ సాధించేలా కనిపించలేదు.  143 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి కోల్ కతా వరుస ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయింది.  అయితే సన్‌రైజర్స్‌ వరుస ఓటములపై కెప్టెన్‌ తన ప్లేయర్లకు వార్నింగ్‌ ఇచ్చాడు.  " మనం ఇండియాలో లేము.. భారత్‌తో పోల్చితే దుబాయ్‌లో బౌండరీలు పెద్దవి. ఆ విషయం ఆటగాళ్లు గుర్తుంచుకోవాలి. మ్యాచ్‌కు ముందు మన మైండ్ సెట్‌ మార్చుకోవాలి. టీ-20 లో డిఫెన్స్‌ ఆడటం కాదు. బౌండరీలు బాదాలి. కేకేఆర్‌ తో  మ్యాచ్‌లో అందుకే మనం ఓడిపోయాం. బౌలర్లు మరింత రాణించాలి" అని ఆటగాళ్లకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చాడు.