కోటి దీపోత్సవంలో నేడు..

కోటి దీపోత్సవంలో నేడు..

కార్తీకమాసం వచ్చిందంటే చాలు హైదరాబాదీలను భక్తిపారవశ్యంలో ముంచేస్తుంది కోటిదీపోత్సవం.. శివనామస్మరణ మధ్య ఎన్టీఆర్ స్టేడియంలో వైభవంగా సాగుతోంది కోటిదీపోత్సవం.. ఇక, కోటివెలుగుల సంబంరం కోటిదీపోత్సవంలో ఇవాళ ఆరోరోజులో భాగంగా భక్తులచే అమ్మలగన్నఅమ్మకి కోటిగాజుల అర్చన చేయిస్తారు. లలితాసహస్రనామస్తోత్ర పారాయణ, బెజవాడ దుర్గామల్లేశ్వరుల కల్యాణం కన్నుల పండువగా జరగనుండగా.. అనంతరం సింహవాహనంపై ఆదిపరాశక్తి అద్భుతంగా సాక్షాత్కారించనున్నారు.. మాతాజీల ఆశీర్వచనంతో పాటు డాక్టర్ ఎన్. అనంతలక్ష్మి ప్రవచనాలు ఉంటాయి.