నిన్న దాదా చెప్పాడు... ఈ రోజు ఎసిసి చెప్పేసింది...

నిన్న దాదా చెప్పాడు... ఈ రోజు ఎసిసి చెప్పేసింది...

కరోనా మహమ్మారి కారణంగా ఆసియా కప్ 2020 వచ్చే ఏడాదికి వాయిదా పడినట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఎసిసి) గురువారం అధికారికంగా ప్రకటించింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) హోస్టింగ్ హక్కులను కలిగి ఉన్న ఈ ఏడాది ఆసియా కప్ టోర్నమెంట్ సెప్టెంబర్‌లో జరగాల్సి ఉంది. "ఈ టోర్నీని బాధ్యతాయుతంగా నిర్వహించడం మా ప్రాధాన్యతగా, కానీ కరోనా కారణంగా దీని వాయిదా వేయక తప్పడం లేదు. ఈ టోర్నమెంట్ 2021 లో జరుగుతుందని బోర్డు ఆశాభావంతో ఉంది. ప్రస్తుతం జూన్ 2021 ను దీనికి తగిన విండోగా పరిశీలిస్తున్నాము" అని  ఎసిసి తెలిపింది. అయితే ఈ విషయాన్ని బోర్డు తెలుపకముందే నిన్నమన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పాడు. ఈ రోజు ఎసిసి  చెప్పేసింది. ఇక ఈ విషయం పై క్రికెట్ అభిమానులు సెటర్లు వేస్తూ... ''అదే విధంగా ఈ ఏడాది జరగాల్సిన ఐసీసీ ప్రపంచ కప్ పై కూడా దాదా ఏదో ఓ నిర్ణయాన్ని ప్రకటిస్తే కానీ అంతర్జాతీయ క్రికెట్ మండలి తన నిర్ణయం చెప్పదు కావచ్చు'' అంటున్నారు.