రాత్రి పగలు కష్టపడి పని చేస్తా: మంత్రి మల్లారెడ్డి

రాత్రి పగలు కష్టపడి పని చేస్తా: మంత్రి మల్లారెడ్డి

నాకు ఇచ్చిన శాఖలో రాత్రి పగలు కష్టపడి పని చేస్తా అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం సచివాలయంలో కార్మిక, మహిళా-శిశు సంక్షేమశాఖల మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ... మంత్రి పదవి ఇచ్చిన్నందుకు తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు ధన్యవాదాలు తెలిపారు. నాకు ఇచ్చిన శాఖలో రాత్రి పగలు కష్టపడి పని చేస్తానన్నారు. కార్మికులకు న్యాయం చేస్తాం. అందరికి అందుబాటులో ఉంటానన్నారు. కేసీఆర్‌ కిట్‌ పథకం ప్రస్తుతం విజయవంతంగా అమలవుతోంది. దాన్ని మరింత సమర్థవంతంగా అమలుచేసేందుకు కృషి చేస్తాను. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను అని మంత్రి మల్లారెడ్డి హామీ ఇచ్చారు.