తండ్రి శవం పక్కనే వారం రోజులు

తండ్రి శవం పక్కనే వారం రోజులు

చనిపోయిన తండ్రి మృతదేహం పక్కన వారం రోజుల పాటు ఉన్నాడు ఓ కొడుకు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన విజయవాడ కానూరులో జరిగింది. ఓ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో లోపలికి వెళ్లిన స్థానికులకు అక్కడి దృశ్యం గగుర్పాటును కలిగించింది. ఓ మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. దాని పక్కనే అతని కుమారుడు పడుకుని ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఉన్న మృతుడి కుమారుడిని మానసిక రోగిగా గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. మృతుడు అనారోగ్య కారణాలతో చనిపోయాడా..? లేక మతిస్థిమితం లేని కుమారుడే చంపాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.