కోహ్లీకి అదే ఆక్సిజన్ లాంటిది...

కోహ్లీకి అదే ఆక్సిజన్ లాంటిది...

తమ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కాంట్రాక్టులను కాపాడటానికి ఆస్ట్రేలియా విరాట్ కోహ్లీని స్లెడ్జ్ చేయలేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ మైఖేల్ క్లార్క్ వ్యాఖ్యానించారు. ఘర్షణను ఇష్టపడే ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీలతో సహా ఆటగాళ్లను కలవరపెట్టడాన్ని ఆస్ట్రేలియా ఇప్పుడు తగించేసింది అని డీన్ జోన్స్ అన్నారు. జోన్స్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ, గొడవ అతనికి 'ఆక్సిజన్ లాంటిది' అయితే ఆస్ట్రేలియా ఆటగాళ్లు అతనికి దానిని తనకు ఇవ్వకుండా చూసుకున్నారు అని తెలిపాడు. ఈ ఏడాది ఆరంభంలో మైఖేల్ క్లార్క్ మాట్లాడుతూ, ఆస్ట్రేలియా క్రికెటర్లు భారత్‌ తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో విరాట్ కోహ్లీని స్లెడ్జింగ్ చేయడంపై 'చాలా భయపడ్డాం' అని డీన్ జోన్స్ వ్యాఖ్యానించారు. అయితే ఆస్ట్రేలియా ఆటగాళ్ళు ఎవరూ ఐపీఎల్ కాంట్రాక్టుల గురించి ఆలోచించలేదని అప్పుడు చాల మంది ఆసీస్ ఆటగాళ్ళు తెలిపారు. అయితే ఇప్పుడు ఎవరు స్పందిస్తారు అనేది చూడాలి మరి.