ట్రైలర్ టాక్ - ప్రేమ.. త్యాగం.. కామ్రేడ్ లక్ష్యం

ట్రైలర్ టాక్ - ప్రేమ.. త్యాగం.. కామ్రేడ్ లక్ష్యం

విజయ్ దేవరకొండ హీరోగా చేసిన డియర్ కామ్రేడ్ ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది.  ఇందులో విజయ్ మూడు వేరియేషన్స్ లో కనిపిస్తున్నట్టు ట్రైలర్ ను చూస్తుంటే అర్ధం అవుతున్నది.  స్టూడెంట్ లీడర్ గా, ప్రేమికుడిగా, లక్ష్యం కోసం ప్రేమను త్యాగం చేసే వ్యక్తిగా మూడు వేరియేషన్స్ లో విజయ్ దేవరకొండ కనిపిస్తున్నారు.  

కాలేజీలో హ్యాపీగా తిరుగే విజయ్ కు కోపం ఎక్కువ.  రాజకీయాలు చేస్తే అసలు సహించడు.  అదే సమయంలో రష్మిక పరిచయం అవుతుంది. ఇద్దరు రిలేటివ్స్. పెద్దయ్యాక కలుసుకుంటారు.  రష్మిక స్పోర్ట్స్ పర్సన్.  క్రికెట్ అంటే ప్రాణం.  స్టేట్ లెవల్ కు క్రికెట్ ఆడుతుంది.  ఆమెకు అండగా ఉంది లక్ష్యాన్ని సాధించే విధంగా ఉండాలని అనుకుంటాడు.  అనుకోకుండా మూడేళ్లు దూరం అవుతాడు.  ఎందుకు దూరం అయ్యాడు.  తిరిగి వచ్చి ఎలా కలుసుకున్నాడు.  అన్నది కథ.  మూడు నిమిషాల ట్రైలర్ లో సినిమా కథ మొత్తం చెప్పేశారు.  కథ చెప్పినా.. ట్రైలర్ చాలా ఇంట్రెస్ట్ గా ఇంటెన్సివ్ గా ఉండటం విశేషం.