డియర్ కామ్రేడ్ ఎలా ఉందంటే..!!

డియర్ కామ్రేడ్ ఎలా ఉందంటే..!!

విజయ్ దేవరకొండ హీరోగా చేసిన డియర్ కామ్రేడ్ మూవీ ఈరోజు రిలీజ్ అయ్యింది.  గీతగోవిందం జంట మరోసారి నటిస్తుండటంతో హైప్ క్రియేట్ అయ్యింది.  ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ మూవికి సంబంధించిన ప్రీమియర్ షోలు ఇప్పటికే ముగిశాయి.  

ఈ సినిమాకు సంబంధించిన విషయాలను ప్రేక్షకులు  ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.  కథ, కథనాలు బాగున్నాయని, కాకపోతే నేరేషన్ స్లోగా సాగిందని ట్వీట్ చేస్తున్నారు. సినిమాలో పెద్దగా ట్విస్ట్ లు లేవని, మెరుపులు లేవుగాని, సినిమా డీసెంట్ గా ఉందని చెప్పి మరికొందరు ట్వీట్ చేస్తున్నారు.  కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సినిమా ఆకట్టుకునే విధంగా ఉందని చెప్పి ట్వీట్ చేస్తున్నారు.  లిల్లీ పాత్రలో రష్మిక నటన బాగుందని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.  మిక్స్డ్ టాక్ వస్తున్న ఈ మూవీకి సంబంధించిన పూర్తి రివ్యూ మెరిసేపట్లోనే వస్తుంది.