సెల్ఫీ మోజులో 18వ అంతస్తు నుంచి కిందపడ్డాడు

సెల్ఫీ మోజులో 18వ అంతస్తు నుంచి కిందపడ్డాడు

సెల్ఫీ పిచ్చితో ప్రాణాలు కోల్పోవొద్దని సందేశమిస్తూ ముంబయి పోలీసులు ఓ వీడియోను ట్వీట్‌ చేశారు. ఏప్రిల్‌ 22న జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. డేరింగ్‌ సెల్ఫీ కోసం ప్రయత్నం చేస్తున్నారా? బాధ్యత లేకుండా సాహసాలు చేస్తున్నారా ? చేసేదేదైనా మీకు మిగిలేది రిస్క్‌ మాత్రమే అంటూ హెచ్చరించారు. సేఫ్టీ ఫస్ట్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో ముంబైపోలీసులు ఈ పోస్ట్‌ పెట్టారు. వివరాల్లోకి వెళితే.. యాంగ్ అనే 19 ఏళ్ల యువకుడు సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్ లో గత క్వీన్ యాంగ్ లో ఉన్న 18 అంతస్థుల భవనంపైకి ఎక్కాడు. భవనం రూఫ్ పై చిట్టచివరి అంచున నిల్చున్నాడు. ఇంతలో ఒక్కసారిగా అతడు నిలుచున్న రూఫ్ లోని కొంత భాగం కూలిపోయింది. అంతెత్తుపై నుంచి యాంగ్ కిందపడిపోయాడు. అంతే నడిరోడ్డుపై పడి అక్కడిక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో ఎదురుగా  ఉన్న భవనం నుంచి ఓ వ్యక్తి వీడియో తీయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. రూఫ్‌టాప్‌ నిర్మాణంలో నాణ్యత లేకపోవడం వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.