కల్తీ మద్యం: 92కి చేరిన మృతుల సంఖ్య

కల్తీ మద్యం: 92కి చేరిన మృతుల సంఖ్య

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతంలో కల్తీమద్యం తాగి చనిపోయిన వారి సంఖ్యం 92కి పెరిగింది. ఉత్తర ప్రదేశ్ మీరట్ ప్రాంతంలోనే 18 మంది చనిపోగా... 46 మంది సహరాన్ పూర్ లో 20 మంది రూర్కీ, 8 మంది కూశీనగర్ లో ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. సహరాన్‌‌పూర్‌లో మృతి చెందిన 46 మందికి పోస్టుమార్టం నిర్వహించగా 36 మంది మంది నాటుసారా కారణంగానే మృతి చెందినట్లు తేలిందని అక్కడి జిల్లా మేజిస్ట్రేట్‌ అలోక్‌ పాండ్య తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్యులు భావిస్తున్నారు. కల్తీ మద్యం తాగి తీవ్ర అనారోగ్యానికి గురైన 20 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కల్తీ మద్యం అమ్మకాలు జరిపిన వారిని విడిచిపెట్టేది లేదని సహరాన్‌‌పూర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు. ఇప్పటికే పలుచోట్ల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందుతులను పట్టుకోవటానికి ఇప్పటికే కొన్ని టీములు రంగంలోకి దిగాయని వెల్లడించారు. ఇప్పటికే 30 మందిని అరెస్ట్ చేసినట్లు తేలిపారు. సుమారు 400 లీటర్ కల్తీ మద్యాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాధిత కుటుంబాలకు ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌ పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ.50వేలు ఇస్తామని ఆయన వెల్లడించారు.