ఫ్లోరిడాను హడలెత్తిస్తున్న హరికేన్

ఫ్లోరిడాను హడలెత్తిస్తున్న హరికేన్

హరికేన్‌ మైకేల్‌ ఫ్లోరిడా తీరాన్ని వణికిస్తోంది. ఒక్కసారిగా విరుచుకుపడిన మైకేల్‌ తీర ప్రాంతాలను అతలాకుతలం చేసింది. వేగంగా వీస్తున్న గాలులు వేలాదిమందిని రోడ్డున పడేసాయి. ఇవాళ కూడా ఫోరిడా,జార్జియా,నార్త్ కరోలిన, విర్జీనియా ప్రాంతాల్లో 18మంది చనిపోయినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. తీరాప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. 4లక్షలమంది నిరాశ్రయులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వందేళ్లలో ఇలాంటి విపత్తు చూడలేదంటున్న అధికారులు. భీకరమైన గాలులతో కూడి భారీ వర్షం కురుస్తుండటంతో జన జీవనం పూర్తిగా స్థంభించిపోయింది.  ఫ్లోరిడాలోని పన్వాండల్ ప్రాంతంలో ప్రవేశించింది హరికెన్, 230 కి.మీ వేగంతో భీకరమైన గాలులు వీస్తూ ఆయా ప్రాంతాలను అతలాకుతలం చేసింది. సముద్రంలో 20 అడుగుల మేర అలలు ఎగిసిపడుతూ దూసుకొస్తున్నాయి. తీవ్రమైన గాలుల కారణంగా ఇళ్ల పైకప్పులు, చెట్లు, విద్యుత్ స్థంభాలు నేలమట్టమయ్యాయి. ఎక్కడ చూసినా మైఖెల్ బీభత్సమే కనిపిస్తోంది. ఈ హరికెన్ ప్రభావం ఫ్లోరిడా, అలబామా, జార్జీయాలో కూడా ఉంటుందని జాతీయ హరికెన్ కేంద్రం వెల్లడించింది.