40 దాటిన మృతుల సంఖ్య...

40 దాటిన మృతుల సంఖ్య...

కొండగట్టు ఘాట్‌ రోడ్డులో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది... ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 40 దాటిపోయింది... 43 మంది వరకు చనిపోయినట్టు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు చెందినవాళ్లుగా గుర్తిస్తున్నారు. మృతుల్లో పాతికమంది వరకు మహిళలే ఉన్నారు. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం కావడంతో కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన భక్తులతో  బస్సు కిక్కిరిసిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 60  నుంచి 65 మంది వరకు ప్రయాణించినట్టు తెలుస్తోంది. ఘాట్‌ రోడ్డులో ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి లోయలోకి పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది... అందరూ ఒకరిపై ఒకరు పడడంతో ఊపిరిఆడకుండా చనిపోయినట్టు చెబుతున్నారు.