కాపు రిజర్వేషన్లపై మాటల యుద్ధం..

కాపు రిజర్వేషన్లపై మాటల యుద్ధం..

అసెంబ్లీలో బడ్జెట్టపై చర్చ జరుగుతోన్న సమయంలో కాపు రిజర్వేషన్ల అంశం అధికా, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. కాపు రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తూ.. కాపు రిజర్వేషన్ల విషయంలో టీడీపీ చిత్తశుద్దితో ఉందన్నారు టీడీపీ ఎమ్మెల్ఏ రాజప్ప.. దీనిపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.. గత ప్రభుత్వంలో ఒక్క కాపు వ్యక్తికైనా బీసీ సర్టిఫికెట్ ఇచ్చారా..? అని ప్రశ్నించారు. దీంతో చంద్రబాబు.. కాపులను మోసం చేసే దిశగా వ్యవహరించారని పార్థసారథి మండిపడ్డారు. ఈ వ్యవహారంలో కలగజేసుకున్న చంద్రబాబు... కాపు రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం తమ విధానం చెప్పకుండా.. తనను విమర్శించడం సరికాదన్నారు. దీంతో సీన్‌లోకి సీఎం వైఎస్ జగన్ ఎంట్రీ ఇచ్చారు. బడ్జెట్‌పై చర్చ జరగకుండా ఓ రాజకీయ అంశంపై చర్చను పక్క దారి పట్టించడం సరికాదన్నారు సీఎం జగన్.. కాపులు ఎక్కువగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ ఎన్ని సీట్లు సాధించిందో చూసుకోవాలంటూ సెటైర్లు వేశారు. అయితే, తాము ఐదు శాతం రిజర్వేషన్ల అంశాన్ని ప్రాసెస్ చేశాం.. దీనిపై తమ విధానం ఏంటో చెప్పాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు డిమాండ్ చేశారు. దీంతో, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్.. చంద్రబాబును చూస్తే సినిమాల్లో విలన్ క్యారెక్టర్ గుర్తొస్తొం్దంటూ వ్యాఖ్యానించారు. జగన్ కామెంట్లుపై టీడీపీ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో.. అచ్చెన్నాయుడుకు సైజ్ అయితే ఉంది కానీ బుర్ర పెరగలేదంటూ సీఎం జగన్ మరోసారి కామెంట్ చేశారు. అచ్చెన్నాయుడుకు తలలో ఉండాల్సిన మెదడు అరికాల్లో ఉందని వ్యాఖ్యానించిన జగన్.. కాపులను చంద్రబాబు అడ్డగోలుగా వ్యతిరేకించారు కాబట్టే ప్రతిపక్షంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. కాపు సంక్షేమం కోసం గత ప్రభుత్వంలో బడ్జెట్ కేటాయింపులు చేసినా.. ఖర్చు మాత్రం చేయలేదన్నారు సీఎం వైఎస్ జగన్.