బాబు విదేశీ పర్యటనలపై నిలదీసిన వైసీపీ..

బాబు విదేశీ పర్యటనలపై నిలదీసిన వైసీపీ..

గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌. ఇవాళ మూడోరోజు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లోని ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఆయన ప్రసంగించారు. 'రకరకాల కారణాలతో చంద్రబాబు విదేశీ పర్యటనలకు వెళ్లారు. ఆ ఖర్చు భారం ప్రజలపై పడింది. ఏపీకి ఐటీ సంస్థలు వస్తున్నాయని, ఐదు బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు తెస్తున్నారని చెప్పి చంద్రబాబు నిరుద్యోగులను మోసం చేశారు. చంద్రబాఉ అనుభవంతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేకపోగా తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు కాకాణి.