రూ.7,000 కోట్ల రికవరీకి నీరవ్ మోడీకి నోటీసులు

రూ.7,000 కోట్ల రికవరీకి నీరవ్ మోడీకి నోటీసులు

రూ.7,000 కోట్లకు పైగా రుణాలు ఎగవేసి పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, ఆయన కుటుంబానికి, వారి కంపెనీలకు రుణ వసూళ్ల ట్రిబ్యునల్ (డీఆర్టీ) సోమవారం నోటీసలు పంపింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) తన రూ.7,029 కోట్ల రుణాన్ని వసూలు చేసుకొనేందుకు జూలైలో డెట్ రికవరీ ట్రిబ్యునల్ కి వెళ్లింది. దాని తర్వాత ఆరు నెలలకు డీఆర్టీ-1 రిజిస్ట్రార్ ఏ.మురళి వసూళ్ల కోసం నోటీసులు పంపారు. ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోడీ, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తిపాస్తులను కొనుగోలు చేయడం, అమ్మడం లేదా బదలాయించడానికి వీల్లేదని నోటీసులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. నోటీసులకు జవాబిచ్చేందుకు 15 జనవరి, 2019 వరకు సమయం ఇచ్చారు. నీరవ్ మోడీ, ఆయన కుటుంబసభ్యులు జవాబు ఇవ్వకపోతే పీఎన్బీ అప్పీలుపై ఏకపక్ష నిర్ణయం తీసుకుంటారు.