డిసెంబర్ 30-జనవరి 5.. ఈ వారం మీ వారఫలాలు

డిసెంబర్ 30-జనవరి 5.. ఈ వారం మీ వారఫలాలు

మేషం:  
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం 
ఈ వారం విజయం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో తగినంత శ్రద్ధ చూపండి. కుటుంబ సభ్యుల సలహాలు లాభాన్ని చేకూరుస్తాయి. ఆర్థికాంశాల్లో పురోగతి ఉంటుంది. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండండి. ఆదిత్య హృదయం  చదువుకోవాలి.
వృషభం: 
కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు 
ఆర్థిక వృద్ధి, గృహలాభం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. సమాజంలో కీర్తిప్రతిష్ఠలు సంపాదిస్తారు. కుటుంబ సభ్యుల సమష్టి నిర్ణయాలు అనుకూలిస్తాయి. మాటపట్టింపులకు పోవద్దు. శాంతియుత వాతావరణం లభిస్తుంది.  వెంకటేశ్వరస్వామి వారిని దర్శించండి.
మిథునం:  
మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
ఆర్థికంగా పుంజుకుంటారు. స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. ఖర్చు పెరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానచలన సూచనలున్నాయి. ఉద్యోగంలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అయితే తెలివితేటలతో ప్రశంసలందుకుంటారు.  ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం. సూర్యారాధన శ్రేష్ఠం.
కర్కాటకం:  
పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష 
గొప్ప అదృష్టయోగముంది. ఆర్థికంగా ఫలితం ఉంటుంది. స్పష్టమైన ఆలోచనా విధానంతో ముందుకు సాగండి. కీలక సమయాల్లో మిత్రుల సలహాలు పనిచేస్తాయి. చేసిన చిన్న ప్రయత్నం కూడా ఫలితాన్నిస్తుంది. కుటుంబ సభ్యులకు మేలు  జరుగుతుంది. భూ గృహ వాహన యోగాలున్నాయి. లక్ష్మీస్తోత్రం శుభాన్ని చేకూరుస్తుంది.
సింహం:
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఈ వరం మొత్తం ఆర్థికంగా కలిసివస్తుంది. ఉద్యోగంలో పేరు, పదవి లభించే అవకాశం ఉంది. ప్రలోభపెట్టే వారున్నారు. మొహమాటం లేకుండా వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉండండి. బంధుమిత్రుల సహకారం అవసరం. ఒక  సంఘటన ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. శివారాధన శ్రేయస్సునిస్తుంది.
కన్య: 
ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు 
ధన లాభం, గృహప్రాప్తి ఉంది. కుటుంబ సభ్యుల సహకారంతో విజయం లభిస్తుంది. అధికారుల నుండి గౌరవ పురస్కారాలున్నాయి. ఖర్చు విషయంలో కొంత జాగ్రత్త అవసరం. గతంలో ఆగిన పనులు కొలిక్కి వస్తాయి. కొందరి వల్ల  సమస్యలు ఎదుర్కొంటారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. సూర్యారాధన శుభప్రదం.
తుల: 
చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
గొప్ప శుభకాలం ఉంది. అదృష్టం వరిస్తుంది. పనులు కార్యరూపాన్ని దాలుస్తాయి. పట్టుదలతో అధికారాన్ని చేజిక్కించుకుంటారు. అనుకోని పనులు కూడా పూర్తి అవుతాయి. కీర్తి శిఖరాలను అధిరోహిస్తారు. ఇష్టదేవతా స్మరణ శక్తినిస్తుంది.
వృశ్చికం:
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ 
విజయం లభిస్తుంది. గౌరవం, ఉద్యోగంలో గుర్తింపూ లభిస్తాయి. కొందరివల్ల ఇబ్బంది కలుగుతుంది. కుటుంబ, స్నేహితుల సూచనలు పని చేస్తాయి. ముఖ్యకార్యాల్లో జాగ్రత్త అవసరం. ఆర్థిక విషయాల్లో మోసపోయే ప్రమాదం ఉంది. ఎవరి  మాటలూ నమ్మవద్దు. గొడవలకు దూరంగా ఉండండి. విష్ణుసహస్రనామం మేలు చేస్తుంది.
ధనుస్సు:
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం 
ధన, ధాన్య లాభాలు ఉన్నాయి. శ్రమ అధికమవుతుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం రావడంలో ఇబ్బందులున్నాయి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చు పెరుగుతుంది. మిత్రబలం పెరుగుతుంది. శుభవార్త వింటారు. ఆదిత్య హృదయం  చదవండి.
మకరం:
ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
మంచి కాలం నడుస్తోంది. శత్రువులు కూడా మిత్రులవుతారు. గత వైభవం మళ్లీ లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నతస్థితి కలుగుతుంది. ధైర్యసాహసాలతో ముందుకు సాగండి. పెద్దల సలహాలు పనికి వస్తాయి. ఒక పని కూడా పూర్తిచేస్తారు. శుభవార్త  వింటారు. శివ దర్శనం సంపదనిస్తుంది.
కుంభం: 
ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
అభీష్టాలు సిద్ధిస్తాయి. పనులు త్వరగా పూర్తవుతాయి. అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ యోగాలున్నాయి. ఇంట్లో శుభం జరుగుతుంది. తోటివారి సహకారం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఒక శుభవార్త ఉంది.  దుర్గాధ్యానం శుభప్రదం.
మీనం:
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
శుభాలు జరుగుతాయి. ఉద్యోగ విషయంలో మంచి ఫలితాలున్నాయి. బాధ్యతలను నిర్వహిస్తారు. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్ధికంగా మేలు జరుగుతుంది. లక్ష్మీ దర్శనం శ్రేయస్సును పెంచుతుంది.