అభినందన్ మీసాలను జాతీయ మీసాలుగా ప్రకటించండి

అభినందన్ మీసాలను జాతీయ మీసాలుగా ప్రకటించండి

భారతీయ వాయు సేన(ఐఏఎఫ్) పైలెట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ మీసాలను జాతీయ మీసాలుగా ప్రకటించాలని లోక్ సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురీ సోమవారం డిమాండ్ చేశారు. అలాగే అభినందన్ కు ఆయన సాహసానికి గుర్తింపుగా పురస్కారం అందజేయాలని కోరారు. పాకిస్థాన్ లో తను నడుపుతున్న మిగ్-21 విమానం కూలిపోవడంతో బందీగా పట్టుబడ్డ అభినందన్ వర్థమాన్, రెండు రోజుల్లో తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా అభినందన్ మీసాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.

పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) దగ్గర భారత గగనతలంలోకి చొరబడలంతో ఐఏఎఫ్ విమానాలు తరిమికొట్టాయి. అప్పుడు అభినందన్ వర్థమాన్ తన మిగ్-21తో పాక్ గగనతలంలోకి వెళ్లారు. విమానాన్ని పాక్ దళాలు కూల్చేయడంతో అభినందన్ బందీగా చిక్కారు. శాంతి సూచనగా రెండు రోజుల తర్వాత వింగ్ కమాండర్ ను పాకిస్థాన్ విడుదల చేస్తున్నట్టు పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీ సంయుక్త సమావేశాల్లో ప్రకటించారు. భారత్-పాక్ ల మధ్య పరిస్థితి చేతులు దాటిపోరాదని ఈ చర్య చేపడుతున్నట్టు తెలిపారు. మార్చి 1, 2019న అభినందన్ వర్థమాన్ విడుదలయ్యారు.