ఎన్సీబీ విచారణలో దీపిక ఏడ్చేసిందట

ఎన్సీబీ విచారణలో దీపిక ఏడ్చేసిందట

ముంబై డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ఎన్సీబీ రియా చక్రవర్తితో పాటు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ జయా సాహాను విచారించింది. వారిచ్చిన సమాచారం ఆధారంగా ఈ కేసులో దీపిక పదుకొనే, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ ‌సింగ్‌లకు సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి మూడు రోజుల్లో తమ ముందుకు హాజరుకావాలని ఎన్సీబీ ఆదేశించింది. అయితే వీరంతా అధికారుల విచారణకు హాజరు అయ్యారు. కాగా దీపికను దాదాపు 5 గంటల పాటు విచారించారు అధికారులు . ఇక జాతీయమీడియా కథనాల ప్రకారం విచారణ సమయంలో దీపికాపదుకొనే  ఏడ్చింది తెలుస్తుంది. అధికారులు ప్రశ్నలు అడుగుతున్న సమయంలో మూడుసార్లు భావోద్వాగానికి గురై కన్నీరు పెట్టుకుందట . ఎన్సీబీ ప్రశ్నించే సమయంలో మూడు సార్లు కేకలు వేస్తూ దీపిక పదుకొనే ఏడ్చేశారని తెలుస్తోంది.డ్రగ్స్ కేసులో దీపికా పదుకొనే సహా శ్రద్ధా కపూర్- సారా అలీ ఖాన్లను కూడా ఎన్.సి.బి ప్రశ్నించింది. నటి దీపికా పదుకొనే డ్రగ్ చాట్ చేసినట్లు అంగీకరించినప్పటికీ.. ఎప్పుడూ డ్రగ్స్ వినియోగించలేదని చెప్పినట్టు తెలుస్తుంది.