వాళ్ళ రిలేషన్ షిప్ ఆ షోలో రివీల్ చేస్తారేమో..!

 వాళ్ళ రిలేషన్ షిప్ ఆ షోలో రివీల్ చేస్తారేమో..!

కాఫీ విత్ కరణ్ సీజన్ 6 త్వరలోనే స్టార్ట్ కాబోతున్నది.  ఇప్పటి వరకు ఐదు సీజన్లు ముగిసాయి.  అనేక మంది బాలీవుడ్ స్టార్స్ తో చిట్ చాట్ జరిగింది.  కరణ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ స్పెషల్ షోలోని ఈ సీజన్ కు ఓ ప్రత్యేకత ఉండబోతున్నట్టు తెలుస్తున్నది. 

ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ జంట ఎవరు అంటే రణ్వీర్ కపూర్.. దీపికా, ప్రియాంక చోప్రా.. నీకీ జోనస్ అని చెప్తారు.  ప్రియాంక చోప్రా.. నికి జోనస్ ల నిశ్చితార్ధం ఇటీవలే జరిగింది.  దీపికా.. రణ్వీర్ ల పెళ్లి విషయం మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా బయటకు చెప్పలేదు.  ఈ జంటను మీడియా ఎన్నిసార్లు ప్రశ్నించిన పెదవి విప్పకపోవడం విశేషం.  కాఫీ విత్ కరణ్ షోలో గతంలో దీపికా.. రణ్వీర్ లు పాల్గొన్నారు.  కాకపోతే విడివిడిగా షో కు వచ్చారు.  ఈసారి ఈ ఇద్దరిని ఒకే ఎపిసోడ్ కు తీసుకురావాలని కరణ్ ప్రయత్నం చేస్తున్నాడు.  ఈ షో ద్వారా వారి పెళ్లి విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలని కరణ్ భావిస్తున్నాడు.  అధికారికంగా ఈ జంట ప్రకటించకపోయినా.. వారి బంధువులు నవంబర్ 20 న జరిగే వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  కాఫీ విత్ కరణ్ సీజన్ 6 లోని ఫస్ట్ ఎపిసోడ్ అక్టోబర్ 21 న ప్రసారం అవుతుంది.