హిడెన్ కెమెరాలతో దీపికా... సల్మాన్ తో అలా నటించాలని ఉందట.. 

హిడెన్ కెమెరాలతో దీపికా... సల్మాన్ తో అలా నటించాలని ఉందట.. 

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె యాసిడ్ బాధితురాలి జీవితం ఆధారంగా చపాక్ సినిమా చేస్తున్నది.  ఈ సినిమా జనవరి 10 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  దీపికా పదుకొనె మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న సినిమా కావడంతో ప్రమోషన్ భారీగా చేస్తున్నారు.  

ఈ సినిమా  ప్రమోషన్స్ లో భాగంగా దీపికా.. సల్మాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 13 షోకు వెళ్ళింది.  అక్కడ సల్మాన్ ఖాన్ తో కలిసి కొన్ని విషయాలు షేర్ చేసుకుంది.  సినిమాను ప్రమోషన్ చేసుకుంది.  పనిలోపనిగా సల్మాన్ ఖాన్ తో సినిమా చేయాలని ఉన్నట్టుగా తన మనసులోని మాటను బయటపెట్టింది ఈ అమ్మడు.  అయితే, సల్మాన్ ఖాన్ తో రెగ్యులర్ సినిమాలు కాకుండా స్పెషల్ గా సినిమా చేయాలని ఉన్నట్టు ఆమె తెలిపింది.  మరి దీపికా కోరిక నెరవేరుతుందా చూద్దాం.  ఇక అంతేకాదు, చపాక్ సినిమా ప్రమోషన్స్ కోసం దీపికా యాసిడ్ బాధితురాలి వేషంతో మరికొంతమందితో కలిసి ముంబై నగరంలోని అనేక మాల్స్ కు వెళ్ళింది.  అక్కడి ప్రజల రియాక్షన్స్ ను రహస్యంగా షూట్ చేశారు.  ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.