దీపిక వ్యాక్స్ స్టాట్యూ ఖ‌ర్చు ఎంత‌?

దీపిక వ్యాక్స్ స్టాట్యూ ఖ‌ర్చు ఎంత‌?

`ప‌ద్మావ‌త్‌` చిత్రంతో దీపిక అద్భుత విజ‌యం అందుకుంది. ఆ సినిమాతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ అమ్మ‌డికి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు వ‌చ్చింది. ఆ క్ర‌మంలోనే మ్యాడ‌మ్ టుస్సాడ్స్ నిర్వాహ‌కులు దీపిక మైన‌పు విగ్ర‌హం ఏర్పాటున‌కు కొల‌త‌లు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అమితాబ్‌, మోదీ, స‌ల్మాన్‌, హృతిక్‌, ప్ర‌భాస్ వంటి స్టార్ల మైన‌పు విగ్ర‌హాల చెంత దీపిక విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌నున్నారు. 

తాజా స‌మాచారం ప్రకారం.. దీపిక మైన‌పు విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌కు టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహ‌కులు భారీగానే ఖ‌ర్చు చేస్తున్నార‌ని తెలుస్తోంది. దీపిక వ్యాక్స్ స్టాట్యూ లెద‌ర్ ఫ్యాంట్స్  ఖ‌రీదు 1.68ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తున్నార‌ట‌. ఇక ఇత‌ర‌త్రా ఆభ‌ర‌ణాల ఖ‌ర్చు భారీగానే ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇక దీని డిజైన్ కోసం పెద్ద మొత్తాన్నే శిల్పుల‌కు చెల్లించాల్సి ఉంటుంది. లండ‌న్, దిల్లీ రెండు చోట్లా మ్యూజియంల‌లో ఒకే త‌ర‌హా దీపిక‌ విగ్ర‌హాల్ని ఏర్పాటు చేస్తామ‌ని ఇదివ‌ర‌కూ టుస్సాడ్స్ నిర్వాహ‌కులు ప్ర‌క‌టించారు. అంటే ఆ మేర‌కు ఖ‌ర్చు కూడా డ‌బుల్ ఉంటుంద‌న్న‌మాట‌!!