చిన్నారి మిస్సింగ్ కేసు విషాదాంతం

చిన్నారి మిస్సింగ్ కేసు విషాదాంతం

 తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చిన్నారి సూరాడ దీప్తిశ్రీ అదృశ్యం ఘటన విషాదాంతమైంది. శుక్రవారం మధ్యాహ్నం అదృశ్యమైన చిన్నారి కోసం మూడు రోజులుగా పోలీసులు గాలించగా.. తాజాగా కాకినాడలోని ఇంద్రపాలెం డ్రెయిన్‌లో దీప్తిశ్రీ మృతదేహం లభ్యమైంది. ధర్మాడి సత్యం బృందంతో కలిసి పోలీసులు నిన్నటి నుండి ఉప్పుటేరులో చిన్నారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. గాలింపు చర్యల్లో ఎనిమిది పోలీస్ బృందాలు పాల్గొన్నాయి. దీప్తిశ్రీని ఉప్పుటేరులోకి తోసేసినట్లు సవతి తల్లి ఒప్పుకొవడంతో కేసు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన  ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.

తూర్పుగోదావరి జిల్లా పగడాలపేటకు చెందిన సత్యశ్యామ్ మొదటి భార్య మూడేళ్ల క్రితం చనిపోయింది. దీంతో, కాకినాడకు చెందిన శాంతికుమారిని వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఏడాది క్రితం బాబు పుట్టాడు. అప్పటి నుంచి దివ్యశ్రీకి సవతి తల్లి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. మూడు రోజుల కిందట దివ్యశ్రీ కనిపించకపోవడంతో పాప తండ్రి పోలీసులకు ఫిర్యాదు  చేశాడు. అయితే సవతితల్లి మాత్రం పాపను  అయిదురు వ్యక్తులకు అప్పగించానంటూ కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించింది. పోలీసులకు అనుమానం వచ్చి ప్రశ్నించడంతో ఆసలు బండారం బయటపడింది. తానే పాపను ఉప్పుటేరులో తోసేశానంటూ చెప్పింది సవతితల్లి.