మరో దారుణం...! చిత్తూరులో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య...

మరో దారుణం...! చిత్తూరులో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య...

ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది.. చిత్తూరులో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది... లాలు గార్డెన్స్‌కు చెందిన ఫాతిమా అనే డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ వ్యవహారమే ఫాతిమా ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. ఫాతిమా.. ఇబ్రహీం అనే యువకుడిని ప్రేమించింది.. అయితే, అతడిని గతంలోనే వివాహమై, పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఫాతిమా దగ్గర దాచిపెట్టిన ఇబ్రహీం.. ప్రేమ వ్యవహారాన్ని నడిపాడు. విషయం తెలియడంతో మనస్తాపానికి గురైన ఫాతిమా ఆత్మహత్య చేసుకుంది. ఇబ్రహీంను అదుపులోకి ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అయితే, ఫాతిమా ఆత్మహత్యకు ఇబ్రహీమే కారణమా? మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.