వాయు కాలుష్యం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీం సీరియస్..

వాయు కాలుష్యం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీం సీరియస్..

దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం కమ్మేస్తోంది.. అయితే, ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి సంవత్సరం వాయుకాలుష్యంతో ఢిల్లీ గ్యాస్ చాంబర్ లా మండుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చర్యలు చేపట్టడం లేదని ఫైర్ అయ్యింది. కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించింది. ప్రజలను ఢిల్లీ రావొద్దని, ఉన్న వారిని ఢిల్లీ వదిలి వెళ్లాలని సూచించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితులకు ప్రభుత్వాలే కారణమంది సుప్రీం. ఒకరినొకరు విమర్శించుకోకుండా సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఆదేశించింది. పొరుగు రాష్ట్రాల్లో పంట తగులబెట్టడంపైనా సుప్రీం అభ్యంతరం వ్యక్తం చేసింది. పంజాబ్, హర్యానా రాష్ట్రాలు తక్షణం పంట తగులబెట్టడం నిలిపివేయాలని ఆదేశించింది. సమస్యకు తక్షణం పరిష్కారం కనుగొనాలని ఆదేశించింది.