విమానంలో సాంకేతిక లోపం.. కేంద్రమంత్రికి తప్పిన ముప్పు..

విమానంలో సాంకేతిక లోపం.. కేంద్రమంత్రికి తప్పిన ముప్పు..

సాంకేతిక లోపం తలెత్తిన విమానం నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తృటిలో తప్పించుకున్నారు... ఇవాళ ఉదయం నాగ్‌పూర్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగోకు చెందిన 6ఈ 636 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం టేకాఫ్‌ సమయంలో గుర్తించిన పైలట్... వెంటనే సిబ్బందికి సమాచారం ఇచ్చాడు.. దీంతో ప్రయాణికులను విమానం నుంచి కిందికి దించివేశారు సిబ్బంది. ఈ సమయంలో ప్రయాణికుల్లో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కూడా ఉన్నారు. గడ్కరీతో పాటు ప్రయాణికులు సురక్షితంగా బయటకు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. ప్రస్తుతం నాగ్‌పూర్‌లోనే ప్రయాణికులు ఉండగా.. సాంకేతిక లోపంతో ఢిల్లీ వెళ్లాల్సిన విమానం వెళ్లలేదని నాగ్‌పూర్ ఎయిర్‌పోర్ట్ సీనియర్ డైరెక్టర్ విజయ్ ములేకర్ తెలిపారు.