ఐపీఎల్ లో ఆ ఘనత సాధించిన 5వ ఆటగాడిగా ధావన్...

ఐపీఎల్ లో ఆ ఘనత సాధించిన 5వ ఆటగాడిగా ధావన్...

ఐపీఎల్ 2020 లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా గత నాలుగు మ్యాచ్‌లలో గబ్బర్ 69*, 57,101*,106* పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2020 లో 421 పరుగులతో రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక ఈ దుబాయ్‌లో నిన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ‌తో జరిగిన మ్యాచ్‌లో ధావన్ ఐపీఎల్ చరిత్రలో 5000 పరుగులు పూర్తిచేసిన 5వ ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌కు ముందు గబ్బర్ ఈ రికార్డుకు 62 పరుగుల దూరంలో ఉన్నాడు. కానీ ఇందులో 106 పరుగులు చేయడంతో ధావన్ 5000 పరుగుల మార్కును దాటిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. ఇక ఈ జాబితాలో 5,759 పరుగులతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనా 5,368 పరుగులతో రెండో స్థానం లో ఉన్నాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ (5158), డేవిడ్ వార్నర్ (5037) నిలిచారు.