ఐపీఎల్ 2021 : ముగిసిన ముంబై ఇన్నింగ్స్... 

ఐపీఎల్ 2021 : ముగిసిన ముంబై ఇన్నింగ్స్... 

ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబైకి ఢిల్లీ బౌలర్లు షాక్ ఇచ్చారు. మొదట ఓపెనర్ డికాక్ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరుకున్న తర్వాత సూర్యకుమార్ యాదవ్ తో కలిపి జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (44) అర్ధశతక భాగసౌమ్యని నెలకొల్పారు. కానీ ఆ తర్వాత ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఒక్కే ఓవర్లో రోహిత్, హార్దిక్ లను అలాగే ఆ తర్వాత వేసిన మరో ఓవర్లో ముంబై స్టార్ హిట్టర్ పొలార్డ్ ను వెన్నక్కిపంపి ఆ జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్(26), జయంత్ యాదవ్(23) కొంచెం ఆచితూచి ఆడటంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఇక ఢిల్లీ బౌలర్లలో  అమిత్ మిశ్రా 4 వికెట్లు పడగొట్టగా అవెష్ ఖాన్ రెండు, మార్కస్ స్టోయినిస్, లలిత్  కగిసో రబాడా ఒక్కో వికెట్ తీశారు. అయితే ఈ మ్యాచ్ లో ఢిల్లీ విజయం సాధించాలంటే 138 పరుగులు చేయాలి. చూడాలి మరి ఎవరు విజయం సాధిస్తారు అనేది.