ఐపీల్ 2020 : ఢిల్లీ క్యాపిటల్స్ బలాలు... బలహీనతలు

ఐపీల్ 2020 : ఢిల్లీ క్యాపిటల్స్ బలాలు... బలహీనతలు

కెప్టెన్ తో సహా ఆటగాళ్లలో కూడా చాలామంది యువకులే. లోతైన బ్యాటింగ్, బలమైన బౌలింగ్ ఉన్న జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. జట్టు పేరు మారడం, కోచ్ గా రికీ పాంటింగ్ రావడంతో ఐపీఎల్ లో ఈ జట్టు పట్టాలెక్కినట్లే కనిపిస్తుంది. గత ఏడాది అన్ని జట్లను వణికించిన ఈ యువకుల జట్టు మూడో స్థానానికి పరిమితమైంది. కానీ ఈ ఏడాది మాత్రం టైటిల్ పై కన్నేసింది. అయితే ఐపీఎల్ లో నిలకడ  లేని జట్టుగా పేరొందిన ఢిల్లీ నాలుగుసార్లు ప్లేఆఫ్‌కి అర్హత సాధించింది. కానీ అందులో మూడుసార్లు మూడో స్థానంలోనే ఆగిపోయింది. అయితే గత కొన్ని సీజన్ల నుండి యువకుల పై నమ్మకం ఉంచిన ఢిల్లీ అద్భుతమైన ఫలితాలు రాబడుతుంది. ఇక గతేడాది కొనసాగించిన జోరును కొంచెం పెంచితే ఐపీఎల్ 2020 లో ఢిల్లీ అద్భుతాలు చేస్తుంది అనడంలో సందేహం లేదు. 

బలాలు : యువ ఆటగాళ్లు అలాగే సీనియర్ ఆటగాళ్లతో ఈ ఏడాది ఢిల్లీ బ్యాలెన్సింగ్ గా ఉంది. ఈ జట్టుకు భారత ఓపెనర్ శిఖర్ ధావన్ అనుభవం బాగా ఉపయోగపడుతుంది. ఇక బెస్ట్ ఫిల్డింగ్, అద్భుతమైన పేస్ బౌలింగ్ ఈ జట్టు సొంతం. ఈ జట్టులో కీ ప్లేయర్స్ గా శిఖర్ ధావన్, రిషబ్ పంత్, కగిసో రబడా, అశ్విన్ కొనసాగుతున్నారు. 

బలహీనతలు : ఈ జట్టుకు ఓపెనర్లు అద్భుతంగా ఉన్న ఫినిషర్లు లేరు. స్పిన్ బౌలింగ్ లో అశ్విన్ మినహా చెప్పుకోదగ్గ బౌలర్లు లేరు. అలాగే యువ ఆటగాళ్లలో ఎవరు ఎప్పుడు ఎలా ఆడుతారో చెప్పడం కూడా కష్టమే.

అయితే ఐపీఎల్ 2020 లో ఈ రోజు పంజాబ్ తో మొదటి మ్యాచ్ ఆడనున్న ఈ జట్టు ఏం చేస్తుందో చూడాలి.