ఢిల్లీతో మ్యాచ్‌ లో తేలిపోయిన చెన్నై సూపర్ కింగ్స్‌

ఢిల్లీతో మ్యాచ్‌ లో తేలిపోయిన చెన్నై సూపర్ కింగ్స్‌

ఢిల్లీతో మ్యాచ్‌లో తేలిపోయింది చెన్నై సూపర్ కింగ్స్‌. అన్ని ఫార్మేట్లలో వైఫల్యం చెంది వరుసగా రెండో మ్యాచ్‌ను కోల్పోయింది..! మరోవైపు.. ఆల్‌రౌండ్ షో తో విజృంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ సునాయస విజయాన్ని అందుకుంది. ఐపీఎల్‌ 13లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌, ఢిల్లి క్యాపిటల్స్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో శ్రేయస్ సేన సూపర్‌ విక్టరీ సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో చెన్నై బాట్స్‌మెన్స్  విఫలమయ్యారు. దీంతో 44 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది.  సీఎస్‌కే 20 ఓవర్లలో  131 పరుగులు మాత్రమే చేయగలిగింది మరోసారి చెన్నై ఓపెనర్లు శుభారంభం ఇవ్వడంలో విఫలమయ్యారు.

అక్షర్‌ పటేల్‌ వేసిన 5వ ఓవర్‌ రెండో బంతికి షేన్‌వాట్సన్‌ భారీ షాట్‌ కొట్టబోయి హెట్‌మెయిర్‌కు‌ క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత మురళీ విజయ్‌ కూడా స్పల్ప స్కోరుకే ఔటయ్యాడు. దీంతో చెన్నై 34 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అండగా నిలుస్తాడు అనుకున్న రుతురాజ్‌ ఓ అనవసరపు పరుగుకు యత్నించి రనౌటయ్యాడు. తర్వాత కేదార్‌ జాధవ్, డుప్లెసిస్ నిలకడగా ఆడినప్పటికి ఫలితం లేకపోయింది. నోర్జే వేసిన 16వ ఓవర్‌ నాలుగో బంతికి కేదార్‌ జాధవ్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. ఇక రబాడ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి డుప్లెసిస్‌ కీపర్‌కు చిక్కాడు.

దీంతో సీఎస్‌కే 18 ఓవర్లకు చెన్నై స్కోర్‌ 121 పరుగులకే ఐదు వికెట్లు కోల్పొయి కష్టాల్లో పడింది. చివరకు ధోనీ కూడా మ్యాచ్ స్వరూపాన్ని మార్చలేకపోయాడు. 15 పరుగులకే ఔటై పెవిలియన్‌కు చేరాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఢిల్లీ  నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీషా 36 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 64 పరుగులు చేశాడు. షాకు ఇది ఐపీఎల్ కెరీర్‌లో ఐదో హాఫ్ సెంచరీ. మొత్తమ్మీద.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రభాగానికి చేరుకుంది. ఇక, ఇవాళ కోలకత్ నైట్ రైడర్స్‌తో హైదరాబాద్ సన్‌రైజర్స్ తలపడనుంది.