సొంతగడ్డపై మరో ఓటమి..

సొంతగడ్డపై మరో ఓటమి..

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు సొంతగడ్డపై మరో ఓటమి తప్పలేదు. హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ - సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో 39 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసి.. హైదరాబాద్‌ ముందు 156 పరుగుల టార్గట్ పెట్టింది. ఐతే లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ తడబడింది. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ 51, జానీ బెయిర్‌స్టో 41 చెలరేగినా ఆ తర్వాతి బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేయడంతో 39 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను చిత్తుచేసింది ఢిల్లీ జట్టు. ఇది హైదరాబాద్ జట్టుకు వరుసగా మూడో ఓటమి కాగా.. ఢిల్లీకి వరసుగా మూడో విజయం.

ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటింగ్‌: పృథ్వీ 4, ధావన్‌ 7, మన్రో 40, శ్రేయస్‌ 45, రిషబ్‌ 23, మోరిస్‌ 4, అక్షర్‌ పటేల్‌ 14 (నాటౌట్‌), పాల్‌ 7, రబాడ 2 (నాటౌట్‌) పరుగులు చేయగా... హైదరాబాద్‌ బౌలర్లు భువనేశ్వర్‌  2 వికెట్లు, ఖలీల్‌ అహ్మద్‌ 3 వికెట్లు, అభిషేక్‌శర్మ, రషీద్‌ఖాన్‌ తలో వికెట్ తమ ఖాతాల్లో వేసుకున్నారు. 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటింగ్‌: వార్నర్‌ 51, బెయిర్‌స్టో 41, విలియమ్సన్‌ 3, రికీ భుయి 7, విజయ్‌ శంకర్‌ 1, హూడా 3, అభిషేక్‌ శర్మ 2, భువనేశ్వర్‌ 2 పరుగలు మాత్రమే చేశారు. ఇక రబాడ 4 వికెట్లు పడగొట్టి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మోరిస్‌ 3 వికెట్లు, కీమో పాల్‌ 3  వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.