ఐదు వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం

ఐదు వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై విజయం సాధించింది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఆరో విజయాన్ని దక్కించుకుంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌  7 వికెట్లకు 163 పరుగులు చేసింది. క్రిస్‌ గేల్‌ (37 బంతుల్లో 69; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరిశాడు. ఢిల్లీ తరుపున ఆడుతున్న నేపాల్‌కు చెందిన యువ స్పిన్నర్‌ సందీప్‌ లమిచానే 3 వికెట్లు తీశాడు. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు చేసి విజయం సాధించింది. ధావన్‌ (41 బంతుల్లో 56; 7 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ అయ్యర్‌ (49 బంతుల్లో 58 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీలతో చెలరేగారు. ఇంగ్రామ్‌ (9 బంతుల్లో 19; 4 ఫోర్లు) ధాటిగా ఆడాడు.