ఢిల్లీ కేపిటల్స్ టార్గెట్: 164

ఢిల్లీ కేపిటల్స్ టార్గెట్: 164

ఫిరోజ్‌షాకోట్ల మైదానంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్‌కు పంజాబ్ జట్టు 164 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఓపెనర్ క్రిస్ గేల్ (37 బంతుల్లో 69 పరుగులు, 6 ఫోర్లు, ఐదు సిక్సర్లు) మరోమారు చెలరేగి ఆడాడు. లమిచ్చనే బౌలింగ్‌లో అక్సర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వారెవరూ నిలబడలేకపోయారు. మన్‌దీప్ సింగ్ (30), హర్‌ప్రీత్ బ్రార్ (20) ఆదుకున్నారు. ఢిల్లీ బౌలర్లలో సందీప్ లమిచ్చనే మూడు వికెట్లు పడగొట్టగా రబడ, అక్సర్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.