రాజస్థాన్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం

రాజస్థాన్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం

ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. లీగ్ దశలో తొమ్మిది విజయాలు సాధించిన ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్ కు చేరుకుంది. రాజస్థాన్ నిర్దేశించని 116 లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి 16.1 ఓవర్లలో చేధించింది. రిషబ్ పంత్ (53 నాటౌట్; 38 బంతుల్లో 2 ఫోర్లు, 5సిక్స్‌లు )చేసి జట్టు విజయంలో కీలకంగా వ్యవహారించాడు. రాజస్థాన్‌ బౌలర్లలో ఇష్‌ సోధి మూడు వికెట్లు తీయగా శ్రేయస్‌ గోపాల్‌ రెండు వికెట్లు తీశాడు.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. రియాన్‌ పరాగ్‌ (50; 49 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్స్‌లు)అర్ధశతకంతో ఒంటరి పోరాటం చేశాడు. కెప్టెన్ అజింక్యా రహానే(2), లివింగ్ స్టోన్(14), సంజూ సాంసన్(5), మహీపాల్ లోమర్(8), శ్రేయస్ గోపాల్(12), స్టూవర్ట్ బిన్ని(0), క్రిష్ణప్ప గౌతం(6), సోధీ(6), వరుణ్‌ ఆరోన్(3) తక్కువ పరుగులు చేసి పెవిలియన్ కు పరిమితమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్‌శర్మ, అమిత్‌ మిశ్రా మూడేసి వికెట్లు తీయగా ట్రెంట్‌ బౌల్ట్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.