టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీ ఇప్పటికే ప్లేఆఫ్స్‌ బెర్తు ఖాయం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్థానంలో ఉన్న ఢిల్లీ ఈ మ్యాచ్‌లో విజ‌యం ద్వారా టాప్-2లో చోటు దక్కించుకోవాలని భావిస్తోంది. రెండు జట్లకీ ఇదే లీగ్ దశ ఆఖరి మ్యాచ్‌కాగా. . ఒకవేళ ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడితే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రెండు మార్పులు చేసింది. స్టీవ్ స్మిత్, జయదేవ్ ఉనద్కట్‌ల స్థానంలో కృష్ణప్ప గౌతమ్, ఇశ్ సోదీలను జట్టులోకి తీసుకుంది. ఢిల్లీ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. సుచిత్, క్రిస్ మోరిస్‌ల స్థానంలో కీమో పాల్, ఇశాంత్‌ శర్మలు జట్టులోకి వచ్చారు.