దూకుడుగా ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్

దూకుడుగా ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఆడుతుంది. 15 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. శిఖర్‌ధావన్‌(50; 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్ లు) హఫ్‌ సెంచరీ చేసి చాహల్ బౌలింగ్ లో వాషింగ్ టన్ సుందర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం శ్రేయస్‌ అయ్యర్‌(21; 16 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్స్ ), రిషబ్ పంత్ (7, 7 బంతుల్లో 1 ఫోరు) క్రిజ్ లో ఉన్నారు.

ఐపీఎల్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బెంగళూరు జట్టులో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. మొయిన్ అలీ స్థానంలో హెన్రిక్ క్లాసెన్‌కు చోటు దక్కింది. టిమ్ సౌథీ స్థానంలో శివం దూబే రాగా, అక్షదీప్ స్థానంలో గుర్‌కీరత్ జట్టులోకి వచ్చారు. ఢిల్లీ జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. మోరిస్ స్థానంలో సందీప్ జట్టులోకి వచ్చాడు.