బెంగళూరు టార్గెట్ః 188

బెంగళూరు టార్గెట్ః 188

ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆట ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. పృథ్వీషా(18) ఉమేష్ బౌలింగ్ లో పార్దీవ్ పటేల్ కు దొరికిపోయాడు. అయితే శిఖర్‌ధావన్‌(50; 37 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్స్ లు), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(52; 37 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్స్ లు) బాధ్యతా యుతంగా ఆడి రెండో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ధావన్‌ ఔటయ్యాక పంత్‌(7), శ్రేయస్‌అయ్యర్‌, కొలిన్‌ ఇంగ్రామ్‌(11) వరుసగా పెవిలియన్‌ చేరారు. ఆఖర్లో రూథర్‌ఫోర్డ్‌(28; 13 బంతుల్లో 1ఫోరు, 3సిక్స్ లు), అక్షర్‌పటేల్‌(16; 9 బంతుల్లో 3ఫోర్లు) దూకుడుగా ఆడారు. దీంతో బెంగళూరు జట్టుకు 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.