ఎలిమినేటర్-2: ఢిల్లీ టార్గెట్ 163

 ఎలిమినేటర్-2: ఢిల్లీ టార్గెట్ 163

విశాఖలోని ఏసీఏ- వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. స్కోర్ 31 పరుగుల వద్ద వృద్దీమాన్ సాహా(8) ఇషాంత్ బౌలింగ్ లో శ్రేయస్ అయ్యర్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అనంతరం మార్టీన్ గుప్తిల్(36; 19 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్స్), మనీష్‌ పాండే(30; 36 బంతుల్లో, 3 ఫోర్లు) ధీటుగా బ్యాటింగ్ చేశారు. పాండే 30 పరుగులు చేసిన అనంతరం కీమో పాల్ బౌలింగ్ లో రూథర్ పోర్డు కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ విలియమ్ సన్ (28; 27 బంతుల్లో, 2 ఫోర్లు) తక్కువ స్కోర్ కే పెవీలియన్ చేరాడు. విజయ్ శంకర్ (25; 11 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్స్‌లు) కాసేపు మెరుపులు మెరిపించి బౌల్ట్ చేతిలో ఔట్ అయ్యాడు. చివర్లో మహ్మద్ నబీ (20; 13 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్స్) ధీటుగా బ్యాటింగ్ చేశాడు. దీపక్ హుడా(4)రషీద్ ఖాన్(0), భువనేశ్వర్ కుమార్ (0), థంపీ(1 నాటౌట్) తక్కువ స్కోర్ కే పరిమితమయ్యారు. ఢిల్లీ బౌలింగ్ లో కీమో పాల్ 3, ఇషాంత్ శర్మ2, బౌల్ట్, అమిత్ మిశ్రా తలో వికెట్ తీశారు.