టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

ఐపీఎల్-12 సీజన్ తుది దశకు చేరుకుంది. కాసేపట్లో విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా మరో రసవత్తర పోరు జరగనుంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఏసీఏ స్టేడియం గతంలో హైదరాబాద్‌కు రెండో సొంత మైదానంగా ఉండేది. ఇక్కడ ఐదు మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు మూడింటిలో నెగ్గి రెండింటిలో ఓడింది. ఈ మైదానం స్వల్ప స్కోర్లకు పెట్టింది పేరు. 2013 నుంచి టీ20లతోపాటు ఐపీఎల్‌లో ఇక్కడ తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 146.