ఐపీఎల్ 2020 : మొదటిసారి ఫైనల్స్ లో అడుగుపెట్టిన ఢిల్లీ...

ఐపీఎల్ 2020 : మొదటిసారి ఫైనల్స్ లో అడుగుపెట్టిన ఢిల్లీ...

ఐపీఎల్ 2020 లో నిన్న క్వాలిఫయర్ - 2 మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్-ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. అయితే ఫైనల్స్ కు వెళ్లాలంటే తప్పకుండ గెలవాల్సిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ఓడిపోయింది. 17 పరుగుల తేడాతో హైదరాబాద్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ కు చేరుకుంది.  క్వాలిఫయర్ - 2 లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ మూడు వికెట్లు కోల్పోయి.. 189 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ లో శిఖర్ ధవన్ 2 సిక్సర్లు, 6 ఫోర్లతో 78 పరుగులు చేసి మళ్ళీ గాడిలో పడ్డాడు. ఇక హైదరాబాద్ జట్టులో వార్నర్, మనీష్ పాండే, హోల్డర్ సరిగా రాణించకపోవడంతో మ్యాచ్ చేజార్చుకుంది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ కు మొదటి నుంచి ఎదురుదెబ్బలు తగిలాయి. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. విలియమ్సన్ 67 పరుగులతో రాణించినా ఫలితం లేకుండా పోయింది. దాంతో ఐపీఎల్ లో చరిత్రలో మొదటిసారి ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది ఢిల్లీ క్యాపిటల్స్.