కరోనాపై కేజ్రీవాల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు... 

కరోనాపై కేజ్రీవాల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు... 

ఢిల్లీలో కరోనా కేసు ఒక్కటే నమోదైంది.  ప్రస్తుతం హాస్పిటల్ లో ఆ వ్యక్తికీ చికిత్స అందిస్తున్నారు.  కరోనా విషయంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.  ఢిల్లీలో అనేక హాస్పిటల్స్ లో స్క్రీనింగ్ సెంటర్స్ ను ఏర్పాటు చేశారు.  కరోనా వైరస్ వ్యాప్తిపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.  

ఎమర్జెన్సీ సమయంలో అధికారులు ఎలాగైతే పనిచేస్తారో అలా పనిచేయాలని, అప్పుడే కరోనాపై విజయం విజయం సాధించగలమని కేజ్రీవాల్ పేర్కొన్నారు.  కరోనా గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఎవరూ కూడా భయపడొద్దని  అన్నారు.  ఇప్పటికే లేడీ హార్డింగ్, ఎల్ఎన్.జీపీ హాస్పిటల్స్ లో కరోనా టెస్టింగ్ ల్యాబ్స్ ను ఏర్పాటు చేసినట్టుగా కేజ్రీవాల్ పేర్కొన్నారు.