ప్రధాని మోడీని కలిసిన కేజ్రీవాల్

ప్రధాని మోడీని కలిసిన కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మోడీకి కేజ్రీవాల్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ అభివృద్ధితోపాటు, సేవ్‌ వాటర్‌, ఆయుష్మాన్‌ భారత్‌ పథకాల గురించి ఈ సమావేశంలో నేతలు చర్చించినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మొహల్లా క్లినిక్‌ను, ప్రభుత్వ పాఠశాలను సందర్శించాలని మోడీని కేజ్రీవాల్ కోరారు. ఈ రెండు పథకాలను కేజ్రీవాల్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నసంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఇరువురు నేతలు భేటీ కావడం ఇదే తొలిసారి.