అందరిదీ ఒకదారైతే.. ఢిల్లీ సీఎం ది మరోదారి...!!  

అందరిదీ ఒకదారైతే.. ఢిల్లీ సీఎం ది మరోదారి...!!  

దిశ హత్య కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే.  నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. నిందితులను పట్టుకున్న వెంటనే ఎన్ కౌంటర్ చేసుంటే ఇంకా బాగుండేదని అంటున్నారు.  అయితే, బాధితురాలి తల్లిదండ్రులు నిందితులకు ఉరి శిక్ష పడుతుందని అనుకున్నాం కానీ, ఇలా ఎన్ కౌంటర్ చేస్తారని అనుకోలేదని, తమ కూతురుకి న్యాయం జరిగిందని, దిశ ఆత్మకు శాంతి చేకూరుతుందని అన్నారు.  పోలీసులకు, ప్రజలకు, ప్రభుత్వానికి వారు ధన్యవాదాలు తెలిపిన సంగతి తెలిసిందే.  

దీనిపై సెలెబ్రిటీలు, వివిధ రాజకీయ నాయకులు తెలంగాణ పోలీసులు తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.  అయితే, దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాత్రం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నిందితులకు చట్టప్రకారం శిక్షపడేలా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుందని, చట్టాలను, న్యాయాలను ప్రతి ఒక్కరు గౌరవించాలని, ఇప్పుడు జరిగిన సంఘటన చూస్తుంటే.. ప్రజలు చట్టాలను, న్యాయాలను గౌరవించడం లేదేమో అనిపిస్తోందని అన్నారు.  ప్రజలందరూ చట్టాలను గౌరవించేలా చూడాలని ఈ సందర్భంగా కేజ్రీవాల్ పేర్కొన్నారు.  మరికొంతమంది జాతీయ కాంగ్రెస్ నేతలు కూడా ఈ ఎన్ కౌంటర్ పట్ల అసంతృప్తితో ఉన్నారు.  మరోవైపు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఈ ఎన్ కౌంటర్ పై నివేదిక అందజేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.