ఢిల్లీ మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణం

ఢిల్లీ మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణం

ఢిల్లీలో మెట్రో రైలు, బస్సు సేవలు మహిళలకు ఉచితంగా అందించాలని ఆమ్ ఆద్మీపార్టీ ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రతిపాదనపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోత్ ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ అధికారులకు సూచించారు. దీనికి సంబంధించిన ఓ నివేదికను సమర్పించాలని డీఎంఆర్సీ సమావేశంలో ఆదేశించారు. దీనిపై ఈనెల 3న నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఢిల్లీ మెట్రోపై పూర్తి అధికారం తమకు అప్పగిస్తే చార్జీలను 25 నుంచి 30 శాతం తగ్గిస్తామని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రకటించిన విషయం తెలిసిందే.