సిక్కుల ఊచకోత: 88 దోషులకు శిక్ష తప్పదు

సిక్కుల ఊచకోత: 88 దోషులకు శిక్ష తప్పదు

1984లో తూర్పు ఢిల్లీలోని త్రిలోక్ పురి ప్రాంతంలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు కారకులైన 88 దోషులను శిక్షించాల్సిందేనని ఢిల్లీ హైకోర్ట్ తీర్పు నిచ్చింది. ఈ దోషులకు 27 ఆగస్ట్ 1996న ట్రయల్ కోర్ట్ 5 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఈ కేసులో కొంద‌రు దోషులు బెయిల్‌పై ఉన్నారు. కొంద‌రు చ‌నిపోయారు. బతికి ఉన్నవారు హైకోర్టులో అప్పీల్ చేశారు. త్రిలోక్‌పురి ఊచ‌కోతల కేసులో 95 మృత‌దేహాలు బయటపడినా ఎవ‌రిపైనా హత్య చార్జ్‌షీట్ లేకపోవ‌డం దారుణ‌మ‌ని ఢిల్లీ హైకోర్ట్ వ్యాఖ్యానించింది. 1984లో జ‌రిగిన దారుణ మారణకాండలో మొత్తం 2800 మందికి పైగా సిక్కులు చనిపోయారు. ఒక్క ఢిల్లీలోనే 2100 మంది చ‌నిపోయారు. ఈ కేసుకు సంబంధం ఉన్నవారిలో ఇంకా 47 మంది బ‌తికి ఉన్నారు. వారిని లొంగిపోవాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.