కమల్ పై పిటిషన్.. కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

కమల్ పై పిటిషన్.. కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

మక్కల్ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్‌కు వ్యతిరేకంగా దాఖలైన క్రిమినల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. కమల్‌హాసన్ తమిళనాడులో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో..ఆ ప్రాంతానికి సంబంధించిన ఫోరమ్ లోనే దీనిపై సంప్రదించాలని పిటిషనర్ బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయకు సూచించింది. అదే విధంగా పిటిషనర్ అశ్విని ఉపాధ్యాయ వేసిన పిటిషన్‌ను పరిగణలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఢిల్లీ హైకోర్టు సూచనలు చేసింది.

తమిళనాడులోని అరవకురిచ్చిలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కమల్ హసన్ మాట్లాడుతూ స్వతంత్ర్య భారత దేశ మొదటి తీవ్రవాదీ ఒక హిందువే అంటూ మహాత్మాగాంధిని కాల్చి చంపిన నాథూరాం గాడ్సేను ఉద్దేశించి మాట్లాడారు.. నాథూరాం గాడ్సే హిందు సంస్థలకు ప్రతినిధి వెళ్లడించారు. ఈ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా పెను దుమారం రేగుతోంది.